డిసెంబర్ రెండవ వారంలో మిర్చి ఆడియో


తాజా సమాచారం ప్రకారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘మిర్చి’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం డిసెంబర్ 10న జరగనుంది. ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ – దేవీ శ్రీ కాంబినేషన్లో ఇది వరకూ వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి.ఈ సినిమాలో యోగా బ్యూటీ అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ ప్రభాస్ సరసన జోడీ కట్టారు. యాక్షన్ అంశాలు ఉంటూనే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ క్రిస్గ్నా రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఫిస్ట్ లుక్ టీజర్ ఈ నెల 18 న విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version