ప్లానింగ్ లో టాలీవుడ్ హీరోలు ప్రభాస్ నుంచి నేర్చుకోవాల్సిందే.!


బాహుబలి అనంతరం ప్రభాస్ పేరు బాలీవుడ్ లో ఒక బ్రాండ్ గా మారిపోయింది. అలాగే ఆ సినిమాతో వచ్చిన అపారమైన క్రేజ్ ను డార్లింగ్ సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాడని కొంత మంది కామెంట్స్ కూడా విసిరారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ప్లానింగ్ చూస్తే మాత్రం వారందరికీ కలిపి ఒకే సమాధానం ఇచ్చాడని చెప్పాలి.

అలాగే డార్లింగ్ లైనప్ ను చూసి మన టాలీవుడ్ హీరోలు కూడా నేర్చుకోవాల్సింది ఉంది. ప్రభాస్ ఇప్పుడు రాబోయే రోజులకు బాలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెట్టి సైన్ చేసిన చిత్రాలు అక్కడ ప్రభాస్ కు మరింత స్టార్డం తీసుకొచ్చేలా ఉందని చెప్పాలి. అక్కడ ఖాన్ ల త్రయం కూడా మెల్లగా తగ్గుతుండడం ప్రభాస్ ను అక్కడ మరింత స్థాయిలో నిలబెట్టే అంశంలా మారింది.

ప్రభాస్ కు అక్కడున్న స్టార్డమ్ ను దృష్టిలో పెట్టుకొనే యష్ రాజ్ ఫిల్మ్స్ సహా ఇతర భారీ నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారంటేనే మనం అర్ధం చేసుకోవచ్చు అక్కడ ప్రభాస్ హవా ఎలా ఉందో అన్నది.ఇప్పుడు తాను చేపట్టిన మూడు పెద్ద ప్రాజెక్టులు ఒకదాన్ని మించి ఒకటి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ముఖ్యంగా “ఆదిపురుష్” అయితే తిరుగు లేకుండా క్లిక్ అవుతుందని అంటున్నారు. అయితే “సాహో” ఫెయిల్యూర్ తర్వాత ప్రభాస్ కూడా గమనించాడు. అందుకే ఒక్క ప్రాజెక్ట్ కు సైన్ చేసి అది పూర్తయ్యాక చేద్దాం అనుకోకుండా ఒకటి లైన్ లో ఉండగానే మరిన్ని ప్రాజెక్టును ఒకే చేసేసాడు.

కానీ మన టాలీవుడ్ లో ఇతర స్టార్ హీరోలు మాత్రం ఒకాసాని తర్వాత ఒకటి చేస్తుండటంతో పాటుగా అవి చెయ్యడానికి కూడా ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు. ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ విషయంలో మాత్రం తన క్రేజ్ ను ఉపయోగించుకొని మన టాలీవుడ్ లో ఇతర హీరోలకు ప్రభాస్ ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version