ఉగాది కి ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్..?

ఉగాది కి ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్..?

Published on Mar 11, 2020 1:00 PM IST

సాహో తరువాత ప్రభాస్ తన తదుపరి చిత్ర షూటింగ్ కి బ్రేక్ తీసుకున్నారు. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక కీలక షెడ్యూల్ కొరకు చిత్ర యూనిట్ త్వరలో యూరప్ వెళ్లనున్నారు. ఐతే ఈ చిత్రం గురించి ప్రభాస్ ఇంత వరకు ఎటువంటి కీలక అప్డేట్ ఇవ్వలేదు. అలాగే సినిమా టైటిల్ విషయంలో కూడా స్పష్టత లేదు. గతంలో జాన్ అనే వర్కింగ్ టైటిల్ ఉండగా అది కూడా కొన్ని కారణాలతో వదులుకోవాల్సివచ్చింది.

ఐతే ఉగాదికి ప్రభాస్ తన ఫ్యాన్స్ కి ఈ విషయాలన్నిటిపై స్పష్టత ఇస్తారట. ఉగాది కానుకగా ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ విడుదలకు కానుందని గట్టిగా వినిపిస్తుంది. మరి ఇదే కనుక నిజం ఐతే ఫ్యాన్స్ కి తెలుగు సంవత్సరాదికి భారీ గిఫ్ట్ అందినట్టే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుండగా, పూజ హెగ్డే మొదటిసారి ప్రభాస్ కి జంటగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు