ఈ బడా బ్యానర్ ను ఇంకా హోల్డ్ లోనే ఉంచిన ప్రభాస్?

ఈ బడా బ్యానర్ ను ఇంకా హోల్డ్ లోనే ఉంచిన ప్రభాస్?

Published on Aug 25, 2020 5:10 PM IST

ప్రస్తుతం మన ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ లో ప్రభాస్ యుగం నడుస్తుంది అని చెప్పాలి. బాహుబలి నుంచి వచ్చిన ఫేమ్ ను చెక్కు చెదరనివ్వకుండా అలా ఎప్పటికప్పుడు భారీ ప్రాజెక్టులను ఎంచుకుంటూ ప్రభాస్ ఇప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతానికి మూడు భారీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ తో మన దేశంలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ సంస్థ అయిన యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ ను ఇంకా హోల్డ్ లోనే ఉంచినట్టు తెలుస్తుంది. గతంలో వీరు “ధూమ్ 4” కోసం ప్రభాస్ ను అప్రోచ్ కాగా ప్రభాస్ అందుకు డేట్స్ లేక ఒప్పుకోలేదు.

కానీ మళ్ళీ వీరు మరో చిత్రంతో ముందుకు వచ్చారు. అది కూడా గత కొన్ని రోజుల కితం మంచి వైరల్ అయిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అని వచ్చిన వార్తలను నిజం చేసేలా ఉన్నట్టు తెలుస్తుంది. అదే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ మరియు ప్రభాస్ లతో సినిమా. ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు అక్కడి భారీ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిద్దార్థ్ ఆనంద్ తో తీయనున్నారని టాక్ వినిపిస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న అన్ని చిత్రాల తర్వాతనే మొదలు కానుంది అని సమాచారం.

తాజా వార్తలు