జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఒక్కసారిగా దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. పర్యాటక కేంద్రంగా ఉన్న పహల్గాంలో 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కిరాతకంగా చంపేశారు. ఈ ఘటనపై దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక ఇప్పుడు ఈ వ్యతిరేకత ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం వైపు సాగుతుంది.
దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఇమాన్వి నటిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో నుంచి ఆమె తొలగించాలంటూ సోషల్ మీడియాలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇమాన్వి తండ్రి మాజీ పాకిస్థాన్ మిలిటరీ అధికారి కావడంతో ఇలాంటి వారిని ఇండియన్ సినిమాల్లో నటింపజేయవద్దంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, ఇమాన్వి పుట్టి పెరిగింది ఢిల్లీలో. అక్కడే చదువుకుని, మోడలింగ్, యాక్టింగ్ నేర్చుకుంది. పాక్తో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారిని ఇండియన్ సినిమాల్లో తీసుకుంటే అభ్యంతరం కానీ, ఇలా ఢిల్లీలో పుట్టిపెరిగిన అమ్మాయికి ఇక్కడ ఛాన్స్ ఇవ్వకూడదనేది ఏమాత్రం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం పహల్గాం దాడితో ఫౌజీ చుట్టూ వివాదం రేగడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.