బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గానే కాకుండా గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి మూవీ జపాన్ మరియు రష్యా వంటి దేశాల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక జపాన్ లో ప్రభాస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జపాన్ దుకాణాల లో ప్రభాస్ ఫొటోలతో టాయ్స్ మరియు వస్తువులు దర్శనమిస్తాయంటే ఆయన క్రేజ్ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.
కాగా తాజాగా ప్రభాస్ సాహోతో రికార్డు కొట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల అక్కడ విడుదలైన సాహో జపనీస్ వర్షన్ అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. అప్పటి వరకు ఉన్న అమీర్ ఖాన్ దంగల్ రికార్డుని సాహో అధిగమించింది. ఇక జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్ లో సాహో, దంగల్, ఇంగ్లీష్ వింగ్లీష్, 3 ఇడియట్స్, ముత్తు మరియు బాహుబలి2 చిత్రాలు ఉన్నాయి. కాగా టాప్ 5 మూవీస్ లో రెండు ప్రభాస్ వి కావడం విశేషం.