జోరుగా హుషారుగా ప్రభాస్ టీం..మరి అలాగే..

జోరుగా హుషారుగా ప్రభాస్ టీం..మరి అలాగే..

Published on Oct 15, 2020 11:00 AM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ కావ్యం “రాధే శ్యామ్”. లేటెస్ట్ గా పూజా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ తో వీరి టీం ఆ నాటి కాలంలోకి తీసుకెళ్లిపోయారు. అయితే లాక్ డౌన్ తోనే ఇటలీలో మళ్ళీ షూట్ ను చిత్ర యూనిట్ షూట్ ను చేస్తున్నారు.

అక్కడ నుంచే చిత్ర యూనిట్ పూజా లుక్ ను రివీల్ చేసారు. అయితే అక్కడ షూట్ విషయంలో మాత్రం వీరు యమ స్పీడ్ గా పని కానిచ్చేస్తున్నారు అని చెప్పాలి. ఇప్పటికే అక్కడ కొన్ని కీలక ప్రదేశాల్లో షూట్ జరుగుతున్న ఆన్ లొకేషన్ ఫొటోస్ మరియు షూట్ వీడియోస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ తో పాటుగా కొంతమంది ఇతర ఫారిన్ ఆర్టిస్టులు కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నారు. మరి ఈ విషయంలో మంచి స్పీడ్ చూపిస్తున్న ప్రభాస్ అండ్ టీం ఇదే స్పీడ్ లో ప్రభాస్ బర్త్ డే కు కూడా ఒక అదిరిపోయే గిఫ్ట్ ను కూడా వదిలితే డార్లింగ్ ఫ్యాన్స్ కు మరింత కిక్కిచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు