ప్రభాస్ కొత్త సినిమా పై ఇంట్రస్టింగ్ రూమర్స్ ?

ప్రభాస్ కొత్త సినిమా పై ఇంట్రస్టింగ్ రూమర్స్ ?

Published on Jul 26, 2020 10:52 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథలో కొంత భాగం
ఓ పురాణ కథలోని పాత్రల నేటి సమాజానికి తగ్గట్లు కథ రాసుకున్నాడని.. ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది చివరి వరకూ సెట్స్ పైకి వెళ్ళదని, విదేశాల నుండి రావాల్సిన అంతర్జాతీయ సాంకేతిక బృందం రాలేని పరిస్థితి ఉండటం, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కి సంబందించి కూడా విదేశాల్లోనే పని చేయాల్సి రావడంతో… ఇక ఈ సినిమాని 2022లో ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి.

మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట.

తాజా వార్తలు