పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల్లో నటిస్తున్న ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రూపొందించేందుకు రెడీ అయ్యాడు. అయితే, ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎడి’ చిత్రం సైన్స్ ఫిక్షన్ మూవీగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
ఇక ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే, కల్కి చిత్రానికి సంబంధించిన సీక్వెల్ చిత్రం ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ లాక్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
అయితే, ‘కల్కి 2898 ఎడి’ లో నటించిన అమితాబ్ బచ్చన్, దాని సీక్వెల్లో కూడా కంటిన్యూ అవుతారు. కానీ, ప్రభాస్ ఇతర ప్రాజెక్టుల కారణంగా ఈ సీక్వెల్ మూవీ మరింత ఆలస్యం అవుతోంది. దీంతో అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్ కూడా ప్రభాస్ వల్ల వెయిట్ చేయాల్సి వస్తుందని బాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంపై మేకర్స్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
