ప్రభాస్ ఆ ముగ్గరు స్టార్ హీరోయిన్స్ ని ఫాలో అవుతున్నాడు.

ప్రభాస్ ఆ ముగ్గరు స్టార్ హీరోయిన్స్ ని ఫాలో అవుతున్నాడు.

Published on Jul 22, 2020 9:58 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కేవలం ఐదుగురిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. వారిలో ముగ్గురు స్టార్ హీరోయిన్స్ కాగా ఒకరు సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ. ఇక ఆ ఐదో వ్యక్తి సాహో డైరెక్టర్ సుజీత్. మరి ప్రభాస్ ఫాలో అవుతున్న ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా శ్రద్దా కపూర్, పూజ హెగ్డే మరియు దీపికా పదుకొనె.ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ని ప్రభాస్ ఫాలో అవుతున్నాడు. ఆ ముగ్గురినే ప్రభాస్ ఫాలో అవడం వెనుక ఓ రీజన్ ఉంది.

శ్రద్దా కపూర్ ప్రభాస్ లేటెస్ట్ రిలీజ్ సాహోలో నటించింది. ఇక పూజా హెగ్డే రాధే శ్యామ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుండగా, దీపికా పదుకొనె ప్రభాస్ 21 మూవీలో హీరోయిన్ గా ఎంపికైనది. నాగ్ అశ్విన్ తన చిత్రం కొరకు ప్రభాస్ కి జంటగా దీపికను ప్రకటించిన నప్పటినుండి వీరు ఒకరిని ఒకరు ఫాలో అవుతున్నారు. అలా ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ లో కేవలం ఈ ముగ్గురు హీరోయిన్స్ ని ఫాలో అవుతున్నాడు .

తాజా వార్తలు