గెట్ రెడీ.. ‘ది రాజాసాబ్’ టీజర్ కోసం డబ్బింగ్ ముగించిన ప్రభాస్..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ హార్రర్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్ర టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని.. ఇప్పటికే ఈ టీజర్ కోసం ప్రభాస్ డబ్బింగ్ కూడా ముగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ టీజర్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడైనా రావచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

Exit mobile version