యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తను నటించిన ‘మిర్చి’ సినిమాతో టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరుగా చేరిపోయారు. ఒక టాప్ స్టార్ ని ఎలా నిర్వచిస్తారు? అంటే ‘ టాప్ హీరో లేదా సూపర్ స్టార్ అని ఎప్పుడు అనిపించుకుంటారంటే తన స్టార్ పవర్, గ్లామర్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో తను నటించిన ఒక డీసెంట్ సినిమా సూపర్ హిట్ అవుతుందో అప్పుడు అతను టాప్ హీరో అని’ కృష్ణా డిస్ట్రిబ్యూటర్ అన్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రభాస్ ‘మిర్చి’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసులు కొల్లగొడుతోంది అని చెప్పవచ్చు. ఈ సినిమా మొదటి వారం కలెక్షన్స్ టాప్ స్టార్స్ అయిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ సినిమాలకు సమానంగా ఉండనున్నాయి.
గత కొన్ని సంవత్సరాల్లో ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ బాగా పెరిగిపోయింది. అలాగే అందరితో కలిసిపోయే మనస్తత్వం, ఎక్కడా వివాదాస్పదమైన పేరు లేకపోవడంతో ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఎస్.ఎస్ రాజమౌళితో చేస్తున్న ‘బాహుబలి’ సినిమాతో బిజీగా ఉన్నారు.