ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా అన్ని పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోతుంది.జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలకు వెళ్ళడానికి జనాలు భయపడుతున్న నేపథ్యంలో సినిమా కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఇక షూటింగ్ షెడ్యూల్స్ ఆగిపోతన్నాయి. అలాగే సినిమా విడుదలను సైతం నిర్మాతలు వాయిదా వేస్తున్నారు.
ఇక ప్రభాస్ సినిమా షూటింగ్ కి సైతం కరోనా ప్రభావం తాకింది. ఈ చిత్ర లేటెస్ట్ షెడ్యూల్ ఆస్ట్రేలియాలో జరపాల్సివుండగా టీం ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియా టూర్ క్యాన్సిల్ చేసిన చిత్ర బృందం, హైదరాబాద్ లో నే భారీ సెట్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.