రచ్చ, రంగం సినిమాలతో పరిచయమైన అజ్మల్ త్వరలో రాజకీయ నేపధ్యంలో సాగనున్న ప్రభంజనం లో కనిపించనున్నాడు. భాస్కర్ రావు ఈ సినిమాకు దర్శక నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది
ఈ సినిమా ఆడియో విడుదల వేడుక ఈరోజు శిల్పకళా వేదికలో జరగనుంది. ఆర్.పి పట్నాయక్ సంగీతదర్శకుడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ ను అందించారు. ఒక విప్లవం సృష్టించడానికి నలుగురు యువకుల రాజకీయ ప్రవేశమే ఈ సినిమా. పే బ్యాక్ టు సొసైటి అనేది ఉపశీర్షిక. అజ్మల్ నటించిన గత చిత్రం కూడా రాజకీయ నేపధ్యంలో సాగినదే. ఆరుషి హీరోయిన్
ఈ సినిమానే కాక అజ్మల్ వంశీ తను మొన్నే వెళ్లిపోయింది లో కూడా నటించాడు. నిఖితా నారాయణ్ హీరోయిన్. ఈ సినిమా వంశీ కెరీర్ లో 25వ చిత్రం