‘పాండవులు పాండవులు తుమ్మెద’ టీం కొత్త వ్యూహాలు

Pandavulu-Pandavulu-Tummeda
‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా ప్రమోషన్స్ ని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ద్వారా మంచి రెవిన్యూ రాబట్టుకోవడం కోసం సరికొత్త విధానాల్ని అవలంబిస్తున్నారు.ఓవర్సీస్ లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. అదికాకుండా సినిమా రిలీజ్ రోజే జింగ్రీల్ ద్వారా ఆన్ లైన్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

అలాగే మార్కెట్ లోకి ఎలాంటి పైరసీ సీడీలు రాకూదాడని యాంటి పైరసీ సెల్ వారిని కూడా అప్రమత్తం చేసారు. పాండవులు పాండవులు తుమ్మెద సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడం వల్ల మోహన్ బాబు మరియు మంచు ఫ్యామిలీకి ఈ మూవీ చాలా కీలకంగా మారింది. శ్రీ వాస్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో లో డా. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, హన్సిక, ప్రణిత, రవీనా టాండన్, తనీష్ వరుణ్ సందేశ్ లు ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version