టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సాలిడ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాలూకా మోషన్ పోస్టర్ కూడా ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని చెయ్యగా దానికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.
అయితే గత సెప్టెంబర్ 2 వ తారీఖున ఉదయం విడుదల కాబడిన ఈ టీజర్ కేవలం 6 గంటల్లోనే నెంబర్ 1 స్థానంలోకి ట్రెండింగ్ వచ్చేసి ఈ రోజు వరకు కూడా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలోనే ట్రెండ్ అవుతుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ పవన్ నుంచి ఒక పవర్ ఫుల్ బిట్ రావడంతో ఆ ఎఫెక్ట్ ఇలా కనిపిస్తుంది అని చెప్పాలి.
ఈ మోషన్ పోస్టర్ టీజర్ కేవలం నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుండడమే కాకుండా 2.5 మిలియన్ వ్యూస్ మరియు 2 లక్షల 10 వేలకు పైగా లైక్స్ ను రాబట్టి మళ్ళీ పవర్ స్టార్ మొదలయిందని తెలుపుతుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రలు పోషిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.