‘గోపాల గోపాల’ డైరెక్టర్ తో పవన్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన వీటి తర్వాత హరీష శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాది సమ్మర్ కల్లా పూర్తైపోతాయి.

పవన్ 2021లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండటంతో పెద్ద నిర్మాతలు ఆయన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. తాజాగా డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 మధ్యలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

మొత్తం మీద పవన్ నుండి ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

Exit mobile version