ఓటీటీ సమీక్ష : బ్యాడ్ గర్ల్ – జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ చిత్రం

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : నవంబర్ 4, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : జియో హాట్‌స్టార్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అంజలి శివరామన్, శాంతిప్రియ, శరణ్య రవిచంద్రన్, హ్రిదు హరూన్, టీజే అరుణసలం, శశాంక్ బొమ్మిరెడ్డిపల్లి తదితరులు
దర్శకుడు : వర్ష భరత్
నిర్మాతలు : వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్
సంగీత దర్శకుడు : అమిత్ త్రివేది
సినిమాటోగ్రాఫర్ : ప్రీత జయరామన్
ఎడిటింగ్ : రాధ శ్రీధర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

తమిళంలో వచ్చిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమా విడుదలకు ముందే వివాదాలతో పాటు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

రమ్య (అంజలి శివరామన్) సంప్రదాయ కుటుంబంలో పెరుగుతుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను పద్ధతిగా పెంచాలని స్ట్రిక్ట్ రూల్స్ మధ్య పెంచుతారు. దీంతో ఆమె తనకు స్వేచ్ఛ కావాలని కోరుకుంటుంది. పదో తరగతిలో ఉన్నప్పుడు నలన్ (హ్రిధు హరూన్) అనే తోటి విద్యార్థితో ఆమె తొలిప్రేమ మొదలవుతుంది. కానీ ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. తరువాత యవ్వనంలోకి అడుగుపెట్టిన రమ్యకు అర్జున్ (శశాంక్ బొమ్మిరెడ్డి పల్లి), ఇర్ఫాన్ (టీ.జే.అరుణసలం) వంటి కొత్త వ్యక్తులతో పరిచయం అవుతుంది. ప్రతి సంబంధం ఆమెకు ప్రేమ, కోరిక, సాన్నిహిత్యం గురించి కొత్త అనుభూతులు నేర్పుతుంది. తనలోని కుతూహలం, ఒంటరితనం, తిరుగుబాటు, అయోమయం మధ్య రమ్య తన నిజమైన ఆకాంక్ష ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తనకు కవాల్సింది స్వేచ్ఛనా? ప్రేమనా? శారీరక సుఖమా? అనే ఆమె అంతర్మథనమే ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

ఇక ఈ సినిమాను అంజలి శివరామన్ వన్ ఉమెన్ షోగా నిలిపింది. ఇంత భావోద్వేగపూరిత మైన, అంతర్ముఖమైన పాత్రను ఆమె నిజాయితీగా పోషించింది. రమ్య మనసులోని అయోమయం, కోరిక, తిరుగుబాటు వంటి అంశాలన్నింటినీ అంజలి సున్నితంగా చూపించింది.

దర్శకురాలు వర్ష భరత్ భావ ప్రధానమైన సన్నివేశాలు చాలా నైపుణ్యంగా రూపొందించారు. తన జీవితంలోని కొన్ని ఘటనల కారణంగా రమ్య మనసులోని ఒంటరితనం, స్వేచ్ఛా ప్రతీకారం నాటుకు పోతాయి. శరణ్య రవిచంద్రన్ (సెల్వి), శాంతిప్రియ(సుందరి) చేసిన సహాయక పాత్రలు కథకు బలం చేకూర్చాయి.

మైనస్ పాయింట్స్ :

‘బ్యాడ్ గర్ల్’ అందరికీ నచ్చే చిత్రం కాదు. ఒక యువతి జీవితంలో కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న బాధలు, ఎమోషన్స్.. వాటి కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు కొన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు. డ్రామాటిక్ ట్విస్టులు లేకపోవడం వల్ల, సాధారణ ప్రేక్షకుడికి కథ నెమ్మదిగా అనిపిస్తుంది.

స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల బలంగా ఉన్నప్పటికీ, కొన్ని భాగాల్లో సడలిపోతుంది. వర్ష భరత్ మొదటి సినిమా అయినా ఆమె ధైర్యంగా ముందుకెళ్లారు. కానీ కొన్ని సన్నివేశాలు మరింత చక్కగా ఎడిట్ చేసుంటే బాగుండేది.

రమ్య పాత్రను చూపించిన విధానం.. ఆమె తన జీవితంలో చివరకు ఏం కోరుకుంటుందనే విషయంపై క్లారిటీ లేకపోవడం.. క్లైమాక్స్ భావోద్వేగ తీవ్రతను అందుకోలేకపోవడం సినిమాకు మైనస్. ఇందులోని ఇంటిమేట్ సీన్స్, బోల్డ్ డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవు

సాంకేతిక విభాగం :

వర్ష భరత్ తన తొలి చిత్రానికే ఛాలెంజింగ్ కథను ఎంచుకున్నారు. ప్రీత జయరామన్ సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా ఉంది. రాధా శ్రీధర్ ఎడిటింగ్ కొన్నిచోట్ల చక్కగా పనిచేసింది. అమిత్ త్రివేది సంగీతం బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా సహజంగా అనిపిస్తుంది.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘బ్యాడ్ గర్ల్’ రియలిస్టిక్ చిత్రంగా కొంతవరకు మాత్రమే ఆకట్టుకుంటుంది. అంజలి శివరామన్ అద్భుత నటనతో చిత్రాన్ని నిలబెట్టింది. బోల్డ్ సబ్జెక్ట్, నెమ్మదిగా నడిచే భావోద్వేగ కథనం అందరికీ నచ్చకపోవచ్చు. రియలిస్టిక్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version