పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేసేసరికి.. తమ అభిమాన హీరోను వెండితెరపై మళ్లీ చూడొచ్చు అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే వాళ్ళ ఆనందానికి కరోనా అడ్డు తగిలింది. కరోనా లేకపోయి ఉంటే.. పవన్ కళ్యాణ్ సినిమాలు ఈ పాటికి రెండు రిలీజ్ అయి ఉండేవి. కానీ కరోనా దెబ్బకు.. ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి. ఆయితే తాజాగా డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందన వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2022లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
డాలీతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ సినిమాని కూడా పవన్ ఒకేసారి పూర్తి చేస్తాడట. డాలీ స్క్రిప్ట్ లో ఎక్కువ భాగం నైట్ ఎఫెక్ట్ లో జరుగుతుందని, అందుకే పవన్ ఈ సినిమా అంగీకరించాడని తెలుస్తోంది. మొత్తం మీద పవన్ నుండి ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం ‘పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది ఎండింగ్ లో ఈ సినిమాల షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.