పవర్ స్టార్ మెచ్చిన వీడియో.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊహలకు అందని మనిషి. ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు ఇప్పుడు బ్యాలెన్సుడ్ గా నడిపిస్తున్నారు. అయితే పవన్ ను ఎక్కువగా హీరోగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. అలాగే పవన్ కూడా తన చిత్రాల్లో చాలా మట్టుకు సామాజిక అంశాలను కూడా ఉండేలా చూస్తుంటారు.

అలా దేశం పట్ల అమితమైన ప్రేమను చూపించే పవన్ సామాజిక మాధ్యమాల్లో కూడా తక్కువ గానే స్పందిస్తారు. సినిమాల కోసం పూర్తిగా పక్కన పెట్టి కేవలం తన రాజకీయాలు మరియు దేశానికి సంబంధించిన పోస్టులు మాత్రమే ఎక్కువగా చేస్తుంటారు. అలా ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్న వీడియో తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకొని “మన మాతృ భూమి అంటే ఇది” అని ట్వీట్ చేసారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ఆ మధ్యన బెంగళూరులో ఓ గుడి వద్ద జరిగిన అల్లర్ల దగ్గర ముస్లిములు మానవహారంలా నిలిచి ఆ గొడవలను ఆపేందుకు హిందూ దేవాలయం దగ్గర నిలబడ్డారు. ఆ వీడియోను పవన్ ఇప్పుడు తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఇపుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించి పలు అప్డేట్లు రానున్నాయి. వాటి కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

https://twitter.com/PawanKalyan/status/1300025436571746304?s=20

Exit mobile version