త్వరలో విడుదలకానున్న పోటుగాడు టీజర్

Potugadu
మంచు మనోజ్ నటిస్తున్న ‘పోటుగాడు’ సినిమా ఆగష్టులో విడుదలకు సిద్ధంగావుంది. పవన్ వాడేయార్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో సిమ్రన్ కౌర్ ముండి, సాక్షి చౌదరి, అను ప్రియ మరియు రచెల్ మొత్తం నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతలు ఈ సినిమా టీజర్ ను మరియు తమిళ నటుడు సింభు పాడిన ఒక పాట మేకింగ్ వీడియోను విడుదలచెయ్యనున్నారు. మంచు మనోజ్ ఈ పాట జూలై 11న విడుదలవుతుందని, మాంచి మాస్ పాటని తెలిపాడు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు. మనోజ్ ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ తోనూ ప్రేమలో పడతాడట. తన పాత్ర చిత్రీకరణ వైవిధ్యంగా వుంటుందని, ఈ సినిమాకు అదే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపాడు. చక్రి మరియు అచ్చు సంగీతాన్ని అందించారు

Exit mobile version