సింగిల్ షాట్ లో క్లైమాక్స్ ఫైట్ ప్లాన్ చేస్తున్న పోటుగాడు

First Posted at 19:00 on Apr 21st

Potugadu
మంచు మనోజ్ హీరోగా చేస్తున్న ‘పోటుగాడు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జోరుగా సాగుతోంది. ఇటీవలే బీజాపూర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం బెంగుళూరు చేరుకున్నారు. ఈ రోజు నుంచి ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ ని షూట్ చెయ్యనున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ స్టీఫెన్ ఈ మూవీకి యాక్షన్ ఎపిసోడ్స్ కోరియోగ్రఫీ చేస్తున్నాడు. నాలుగు నిమిషాలు సాగే క్లైమాక్స్ ఫైట్ ని సింగిల్ టేక్ లో తియ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘ ఈ రోజు పోటుగాడు క్లైమాక్స్ షూట్, 4 నిమిషాల ఫైట్ ని సింగిల్ షాట్ లో ప్లాన్ చేస్తున్నా, దేవుడు తోడుగా ఉంటాడని ఆశిస్తున్నానని’ మనోజ్ ట్వీట్ చేసాడు.
ఈ సినిమాలో సాక్షి చౌదరి, సిమ్రాన్ ముంది కౌర్, నథాలియా కౌర్, మరో హీరోయిన్ నటిస్తోంది. పవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని రామలక్ష్మీ మూవీస్ బ్యానర్ పై శిరీష శ్రీధర్ నిర్మిస్తున్నారు.

Exit mobile version