మంచు మనోజ్ ప్రస్తుతం ‘పోటుగాడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జూలైలో విడుదలైయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా తెలియజేశాడు. మనోజ్ ఈ సినిమాలో ఎంటర్టైనింగ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకి పవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సిమ్రాన్ ముండి, నథాలియ కౌర్, సాక్షి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చక్రి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా పోస్ట్ -ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.