డబ్బింగ్ పూర్తి చేసిన స్టార్ హీరో !

తమిళంలో చిత్రపరిశ్రమ ఆ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, లాక్ డౌన్ కు ముందు షూటింగ్ పూర్తీ చేసుకున్న అన్ని పెద్ద మరియు మధ్య తరహా చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాయని మేము ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. వాటిలో భారీ అంచనాలు ఉన్న సినిమా విజయ్ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘మాస్టర్’.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విజయ్ తన పార్ట్ కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసారు. మరో ఇరవై రోజుల్లో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కానున్నాయి. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపించనున్నారు.

కాగా విజయ్ పుట్టినరోజు స్పెషల్‌గా జూన్ 22 న మాస్టర్‌ను విడుదల చేయాలని యూనిట్ యోచిస్తోంది. విజయ్ గత సినిమా ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’గా వచ్చి ఇక్కడ మంచి కలెక్షన్స్ ను రాబట్టి, విజయ్ కు మాస్ ప్రేక్షకులలో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది దాంతో విజయ్ ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది.

Exit mobile version