స్టొరీ రైటర్, నటుడు అయిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ అయిపోతున్నాడు. గత సంవత్సరం రానా – నయనతార జంటగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో కార్ డ్రైవర్ పాత్రలో కనిపించాడు. ఈ సంవత్సరం వచ్చిన ‘నాయక్’ సినిమాలో పోసాని ఓ పాత్రలో కనిపించాడు. సినిమాలో అతనిది చిన్న పాత్రే అయినా నటుడిగా అతని కెరీర్ ని టర్న్ చేసింది. దాంతో అతనికి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
నాయక్ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో పోసాని 12 సినిమాలకు సైన్ చేసాడు. అందులో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ మూవీ, క్రిష్ – మహేష్ బాబు మూవీ, రాఘవేంద్ర రావు ‘ఇంటింటా అన్నమయ్య’, అల్లు అర్జున్ సినిమా, అలాగే రామానాయుడు ప్రొడక్షన్లో రానున్న ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే ఒక న్యూస్ పేపర్ కి చెప్పారు. రైటర్ కెరీర్ ప్రారంభించిన పోసాని ప్రస్తుతం నటుడిగా బిజీగా కానున్నాడు.