మరో హర్రర్ థ్రిల్లర్ కి సైన్ చేసిన పూర్ణ

మరో హర్రర్ థ్రిల్లర్ కి సైన్ చేసిన పూర్ణ

Published on May 5, 2013 9:15 AM IST

Poorna
నటుడు, డైరెక్టర్ రవిబాబు తీసిన ‘అవును’ సినిమా సక్సెస్ హర్రర్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా చేయడానికి స్పూర్తినిచ్చింది. ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన పూర్ణ తన పెర్ఫార్మన్స్ కి అందరి నుండి ప్రశంశలు అందుకుంది. ఆ సమయంలో పూర్ణ కి చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఆవన్నీ హార్రర్ థ్రిల్లర్స్ కావడం విశేషం. “నాకు త్వర త్వరగా సినిమాలు చేసెయ్యాలని లేదు, అలాగే ఒకే రకమైన పాత్రలకి పరిమితమవ్వాలని లేదు. అందుకే నా సినిమాలు రావడానికి ఆలస్యమవుతున్నాయని’ పూర్ణ తెలిపింది.

కానీ వచ్చిన అన్ని సినిమాలు ఓకే చెయ్యకపోయినా ఒక హర్రర్ థ్రిల్లర్ సినిమాకి మాత్రం సైన్ చేసింది. ఈ సినిమాకి ‘ఒక్కసారి అవును ఒక్కసారి కాదు’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమా ఇద్దరి స్నేహితుల జీవితాల మీద తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇది కాకుండా పూర్ణ ప్రస్తుతం ‘తెలుగు బాషలో నాకు నచ్చని ఒకేఒక్క పదం – ప్రేమ’, ‘నువ్వలా నేనిలా’ సినిమాల్లో నటిస్తోంది.

తాజా వార్తలు