అక్కినేని నాగ చైతన్య ‘తడాఖా’ విజయం సాధించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆ సినిమా విజయం తర్వాత నాగ చైతన్య ఇక నుంచి హిట్ పరంపరని కొనసాగించాలని ఆచితూచి కథలని ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య ‘మనం’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఇది కాకుండా నాగ చైతన్య ఇప్పటికే ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో విజయం అందుకున్న విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మాజీ మిస్ ఇండియా యూనివర్స్ పూజా హెగ్డేని ఎంపిక చేసినట్లు సమాచారం.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాలో హీరోయిన్ ది నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర. అందుకే కొత్త హీరోయిన్ మరియు నటన తెలిసిన వాళ్ళైతే బాగుంటుందని పూజని సెలెక్ట్ చేసారని సమాచారం. ఈ విషయపైన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.