మన టాలీవుడ్ లో ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తక్కువమందిలో పూజా హెగ్డే కూడా ఒకరు. దాదాపు అందరి స్టార్ హీరోలను చక్కబెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్ ఇపుడు ప్రభాస్ తో రాధే శ్యామ్ అనే భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉంది. అలాగే మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టుకున్న ఈ హీరోయిన్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ టీం వారు ఆమె రోల్ ను రివీల్ చేసి పోస్టర్ ను విడుదల చెయ్యగా మిగతా సినీ ప్రముఖులు అంతా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
అలా టాలీవుడ్ రాక్ స్టారింగ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆమెకువిషెష్ చెప్పగా బదులు థాంక్స్ చెప్తూ దేవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ “అత్తారింటికి దారేది”లోని దేవ దేవం పాటను రిపీటెడ్ గా వింటున్నానని తెలిపింది. దీనితో పవన్ ఫ్యాన్స్ కు సోషల్ మీడియాలో మంచి కిక్కిచ్చినట్టు అయ్యింది. అలాగే పూజా పవన్ తో ఒక సినిమాలో కూడా నటించనుంది అని టాక్ కూడా ఈ మధ్యనే ఊపందుకుంది. బహుశా ఇదంతా ఆ ఎఫెక్టే అని చెప్తున్నా వారు కూడా లేకపోలేరు.
Thank youuu ????❤️ Still listening to Deva Devam on repeat ???? https://t.co/9IBaxWFxeP
— Pooja Hegde (@hegdepooja) October 14, 2020