అదే జరిగితే ‘పూజా హెగ్డే’ క్రేజ్ పీక్ రేంజ్ కే !

అదే జరిగితే ‘పూజా హెగ్డే’ క్రేజ్ పీక్ రేంజ్ కే !

Published on Jul 27, 2020 4:01 PM IST

‘అల వైకుంఠపురంలో’ ‘అరవింద సమేత’ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ‘పూజా హెగ్డే’. పైగా ఈ బ్యూటీ ప్రభాస్ కు జోడీగా ‘రాధే శ్యామ్’ సినిమాలో కూడా నటిస్తోంది. దాంతో ‘పూజా హెగ్డే’ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లోనూ స్టార్ డమ్ కోసం బాగానే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండీ’ సినిమాలో పూజా నటిస్తోంది.

కాగా ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ కృతి సనన్ అయినా, ‘పూజా హెగ్డే’ది కూడా మెయిన్ రోలేనట. పైగా కృతి సనన్ కంటే పూజా హెగ్డేకి రెండు మాస సాంగ్స్ ఉన్నాయట. అలాంటి సాంగ్స్ లో పూజా హెగ్డేకి తిరుగుండదు కాబట్టి.. కృతి సనన్ కంటే కూడా సినిమాలో పూజా హెగ్డేకే పేరు రావొచ్చు. అదేగనుక జరిగితే బాలీవుడ్ లోనూ మెయిన్ హీరోయిన్ గా ‘పూజా హెగ్డే’కి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పెరుగుతాయి. అప్పుడు పూజా క్రేజ్ బాలీవుడ్ లోనూ పీక్ రేంజ్ కే వెళ్లొచ్చు.

తాజా వార్తలు