అప్పటికే ‘బద్రి’, ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమా విజయాలతో ఫుల్ ఫామ్ మీద వున్న డైరెక్టర్ పూరి జగన్నాధ్. ‘మురారి’, ‘ఒక్కడు’ లాంటి బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చి జోరుమీదవున్న హీరో మహేష్. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమాయే ‘పోకిరి’. ఈ సినిమా అప్పట్లో వున్నా అన్ని రికార్డులను తుడిచిపెట్టి మహేష్ ను టాలీవుడ్ నెంబర్1 రేసులో నిలబెట్టింది. ఈ సినిమా నేటితో ఏడేళ్ళు పూర్తిచేసుకుంది.
ఈ సినిమాలో ఆన్నీ విశేషాలే. అప్పట్లో మహేష్ డైలాగ్ డెలివరీ మీద వున్నా డౌట్స్ అన్నీ పోగొట్టడానికి ఈ సినిమాలో పూరి పెట్టిన పవర్ ఫుల్ పంచ్ డైలాగులను చక్కగా పలికి అందరి మన్ననలను పొందాడు. ఇలియానాను లైం లైట్ లోకి తెచ్చింది కుడా ఈ సినిమానే. ఈ సినిమాలో పూరి లాస్ట్ లో ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ట్విస్ట్ ను ఇప్పటికీ చాలా సినిమాలలో చాలా మంది ఫాలో అవుతున్నారంటే అది అతిశయోక్తి కాదు. అన్ని వండర్స్ ను క్రియేట్ చేసిన వండర్ఫుల్ మూవీ ‘పోకిరి’ డైలాగ్ లను ఒకసారి మరలా చూడండి.