అక్కినేని నాగేశ్వర రావును ఘనంగా సన్మానించనున్న లలిత కళా పరిషత్

అక్కినేని నాగేశ్వర రావును ఘనంగా సన్మానించనున్న లలిత కళా పరిషత్

Published on Apr 3, 2012 1:58 PM IST


మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటుడిగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 9న లలిత కళా పరిషత్ వారు ఆయనను ఘనంగా సన్మానించబోతున్నారు. అక్కినేని నట జీవన ప్లాటినం జుబ్లీ ఉత్సవాలు పేరిట చేయనున్న ఈ వేడుకకు తెలుగు, తమిళ భాషల నుండి దాదాపు 50 మందికి పైగా నటీనటులు హాజరు కానున్నారు. కళాబంధు డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి నిర్వహిస్తున్న ఈ వేడుక శిల్ప కళా వేదికలో జరగనుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేయనున్న వేడుక ఘనంగా చేయాలని నిర్ణయించారు. ఈ వేడుకకి సంభందించిన విషయాలు కాకతీయ హోటల్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేసారు.

తాజా వార్తలు