సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్స్ గా నటించిన ‘ప్రేమ కథా చిత్రమ్’ సూపర్ హిట్ అయ్యే దిశలో దూసుకుపోతోంది. మొదటి రోజు థియేటర్ కలెక్షన్స్, శాటిలైట్ రైట్స్ తోనే ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ వచ్చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతకన్నా మించిన మౌత్ టాక్ చాలా పాజిటివ్ గా ఉండడంతో మారుతి గతంలో తీసిన ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
ఈ సినిమా డైరెక్టర్ జె. ప్రభాకర్ రెడ్డి సినిమా విజయం గురించి మాట్లాడుతూ ‘ మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము కేవలం నాలుగు పాత్రలతో, తక్కువ బడ్జెట్ తో సినిమా తీశాము. కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యిందని’ అన్నాడు. ఈ సినిమాకి కథ, డైలాగ్స్ మారుతి అందించాడు. సుధీర్ బాబు, నందిత ఈ సినిమాకి దక్కిన విజయాన్ని చూసి చాలా థ్రిల్ అయ్యారు. అలాగే ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్లో తమ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకి థాంక్స్ చెప్పారు. ఈ సినిమాకి జెబి సంగీతం అందించాడు.