ఆదివారం పవన్ పొలిటికల్ ప్రెస్ మీట్?

ఆదివారం పవన్ పొలిటికల్ ప్రెస్ మీట్?

Published on Mar 6, 2014 4:07 PM IST

pawan-kalyan
ప్రస్తుతం వినపడుతున్న తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రెస్ మీట్ మార్చి 9న లేదా మార్చి 10న ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ పలు విషయాల గురించి, అలాగే తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై కూడా సమాధానం ఇస్తాడని సమాచారం.

ఈ ప్రెస్ మీట్ కోసం, అలాగే అక్కడ పవన్ రాజకీయ ప్లాన్స్ గురించి ఏం చెబుతాడు అనే విషయాల గురించి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అప్పటి వరకూ ఈ విషయంపై మీడియా ప్రపంచంలో పలు వార్తలు వస్తూనే ఉంటాయి. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్ 2’, ‘ఓ మై గాడ్’ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ రెండు సినిమాలకు మే తర్వాత నుండి పవన్ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఆ టైం కి తెలంగాణ, సీమాంధ్రలో ఎలక్షన్స్ కూడా ఐపోతాయి.

తాజా వార్తలు