పిజ్జా సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘విల్లా(పిజ్జా 2)’ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ ఈ వారంలో విడుదలకానుంది. ఈ సినిమా నవంబర్ 14న విడుదలకావాల్సివుండగా ఈరోజు విడుదల చేసిన ప్రెస్ నోట్ ను బట్టి ఈ సినిమా నవంబర్ 15న విడుదలవుతుంది అని తెలుస్తుంది
‘పిజ్జా’ సినిమా విజయం కావడంతో ఈ కొనసాగింపుకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితుల అంచనా. పాత వర్షన్ లానే ఈ సినిమా కూడా థ్రిల్లింగ్ నేపధ్యంలో సాగనుంది
అశోక్ మరియు సంచితా పధుకునే ప్రధాన పాత్రధారులు దీపన్ ఆర్ దర్శకుడు. తెలుగు వర్షన్ అనువాదహక్కులను గుడ్ సినిమా గ్రూప్ సొంతం చేసుకుంది. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించాడు