ఏప్రిల్ చివర్లో ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఆడియో

sai-dharam-tej
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’. సాయి ధరమ్ తేజ్ సరసన రేజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మేలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ఏప్రిల్ చివరి వారంలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఆడియోని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సాలిడ్ డాన్సులతో మెప్పిస్తాడని సమాచారం. ఎఎస్ రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని హర్షిత్ రెడ్డి సమర్పణలో బన్ని వాస్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Exit mobile version