నార్త్ లో అల్లు అర్జున్ రూలు.. భారీ రికార్డుతో ఐపీఎల్ ని మించిన క్రేజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నార్త్ మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన ఖాన్స్ సెట్ చేసిన రికార్డులని సైతం అల్లు అర్జున్ తన పుష్ప 2 సినిమాతో భారీ మార్జిన్ తో కొట్టి నార్త్ మార్కెట్ లో ఏ సినిమాలు కూడా అందుకోని సంచలన రికార్డులు సెట్ చేసాడు.

ఇక ఇదే హిందీ మార్కెట్ లో పుష్ప రాజ్ సెట్ చేసిన మరో సంచలన రికార్డు సెట్ చేసింది. ఇండియా వైడ్ గా ఎంతో ఎక్కువగా చూసే ఐపీఎల్ యావరేజ్ రికార్డుని సైతం పుష్ప 2 టెలికాస్ట్ లో బద్దలుకొట్టిందట. ఐపీఎల్ 2025కి 4.6 టెలివిజన్ రేటింగ్ వస్తే పుష్ప 2 కి మొదటి ప్రీమియర్ లో 5.1 టీవీఆర్ వచ్చినట్టు తెలుస్తుంది.

దీనితో ఐపీఎల్ ని మించిన మ్యానియా హిందీలో బుల్లితెరపై అల్లు అర్జున్ చూపించాడని చెప్పాలి. ఇక ఇదే కాకుండా సినిమాల పరంగా కూడా అక్కడ భారీ హిట్ అయ్యిన స్త్రీ 2 రికార్డుని కూడా పుష్ప 2 దాటేసిందట. ఇలా మొత్తానికి మాత్రం నార్త్ మార్కెట్ లో అల్లు అర్జున్ రూలు ఇది అని చెప్పడంలో సందేహం లేదు.

Exit mobile version