OTT: టీజర్ తర్వాత లెక్కలు మార్చేసిన ‘అఖండ 2’.. ఓటిటి డీల్స్ పై ఫ్యాన్స్ రిక్వెస్ట్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన మాస్ అండ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “అఖండ 2” కోసం అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే బాలయ్య బర్త్ డే కానుకగా వదిలిన టీజర్ అన్ని లెక్కలు మార్చేసింది అని చెప్పాలి. ఊహించని లెవెల్లో ప్లాన్ చేసిన ఈ టీజర్ పాన్ ఇండియా లెవెల్లో మంచి రీచ్ ని సొంతం చేసుకుంది.

అయితే ఈ టీజర్ తర్వాతే సాలిడ్ ఓటిటి ఆఫర్స్ కూడా మొదలయ్యాయని వినిపిస్తుంది. మరి వీటిలో మేకర్స్ ఒక రేట్ పెట్టుకోగా ఫ్రంట్ రన్నర్ గా ప్రైమ్ వీడియో సంస్థ ఉందని టాక్ ఉంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇందుకు వద్దంటున్నారు. మరింత రీచ్ అండ్ క్వాలిటీ నెట్ ఫ్లిక్స్ నుంచి ఉంటుంది అని వారితో ఓటిటి డీల్ లాక్ చేసుకుంటే బెటర్ అని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రొడ్యూసర్స్ కి అల్టిమేట్ గా కావాల్సింది బిజినెస్ సో చూడాలి వారి అంచనాలకి ఏ ఓటిటి సంస్థ కొనుగోలు చేసుకుంటుందో అనేది.

Exit mobile version