ఫోటో మూమెంట్: గారాల కూతురు సితార బర్త్ డేకి మహేష్ స్పెషల్ పోస్ట్!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇపుడు పాన్ వరల్డ్ లెవెల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గ్యాప్ లో కూడా మహేష్ తన కుటుంబంతో హ్యాపీ మూమెంట్స్ గడుపుతున్నాడు. మరి లేటెస్ట్ గా తన గారాల కూతురు సితార ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు లానే విష్ చేసాడు కానీ ఇది మాత్రం కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు.

టీనేజ్ లోకి అడుగు పెట్టిన సితార

మహేష్ బాబు, నమ్రత జంట ఏకైక కూతురు సితార ఘట్టమనేని ఈ ఏడాదితో పన్నెండేళ్ళు పూర్తి చేసుకుంది. దీనితో టీనేజ్ లోకి అడుగు పెట్టిన సితారపై మహేష్ జస్ట్ అలా తను టీనేజ్ లోకి వచ్చేసింది అంటూ గడిచిన ఇన్నేళ్లు చిటికలో అయిపోయాయి అన్న విధంగా తెలిపారు.

అభిమానులు ఆనందం

తమ అభిమాన హీరో లవ్లీ ఫ్యామిలీ అంటే అభిమానులకి కూడా ఎంతో ప్రేమ. మరి మహేష్ ఆనందంలోనే తమ ఆనందం కూడా చూసుకుంటారు. ఇలా సితార బర్త్ డే కి మహేష్ చెప్పిన విషెస్ తో తాము కూడా సితారకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ – రాజమౌళి సినిమా ముచ్చట్లు

అనౌన్సమెంట్ రాకపోయినప్పటికీ భారీ హైప్ వీరి కలయికపై ఉంది. అయితే ప్రస్తుతం జక్కన్న భారీ కాశీ సెట్టింగ్స్ లో షూటింగ్స్ చేస్తూనే టాంజానియాలో కూడా లొకేషన్స్ వెతుకుతున్నారట. ఇలా ప్యాకెడ్ గా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది.

Exit mobile version