ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు సుజిత్ తో చేస్తున్న క్రేజీ యాక్షన్ చిత్రం “ఓజి” కూడా ఒకటి. దీనిపై ఉన్న హైప్ అయితే అంతా ఇంతా కాదు. మరి ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వారిలో టాలెంటడ్ నటుడు అర్జున్ దాస్ కూడా ఒకడు. సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని కూడా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తోనే రిలీజ్ చేశారు.
అయితే ఫైనల్ గా అర్జున్ దాస్ పవన్ తో జర్నీ కోసం షేర్ చేసుకుంటూ పలు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. వీటిలో ఇద్దరి నడుమ బాండింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతో ఆప్యాయంగా ఈ స్నాప్స్ కనిపోయిస్తుండగా పవన్ షూట్ లుక్స్ లోనే కనిపిస్తున్నారు. దీనితో వీరి నడుమ ఈ పవర్ ఫుల్ స్నాప్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
♥️♥️#ForeverGrateful pic.twitter.com/omHTQ3D8Zt
— Arjun Das (@iam_arjundas) June 6, 2025