ప్రజలు నన్ను డిఫరెంట్ గా చూడాలనుకుంటున్నారు – వెంకటేష్

ప్రజలు నన్ను డిఫరెంట్ గా చూడాలనుకుంటున్నారు – వెంకటేష్

Published on Nov 13, 2013 9:20 AM IST

Venkatesh

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ చాలా కాలంగా కోన సాగుతూ మంచి పేరు సంపాదించుకన్న హీరో. ఆయన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలలో నటించి తనదైన పేరు నమోదు చేసుకున్నాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో నటించి ఒక కొత్త ట్రెండ్ ను ప్రారంభించాడు. ప్రస్తుతం తను దానిని కొనసాగిస్తున్నాడు . రెండు దశాబ్దాల తరువాత వెంకటేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్ బాబు తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలను మళ్ళి మొదలుపెట్టాడు .దీనితో ఇండస్ట్రీలో మళ్ళి మల్టీ స్టారర్ సినిమాలు ప్రారంభం అయ్యాయి. ఈ ట్రెండ్ ను అలాగే కొనసాగిస్తూ వెంకటేష్ మరో మల్టీ స్టారర్ సినిమా ‘మసాలా’ లో రామ్ తో కలిసి నటించాడు. ఇప్పుడు మరో హీరో రామ్ చరణ్ తో కలిసి కృష్ణవంశీ దర్శకత్వం లో నటించనున్నాడు

ఈ మల్టీ స్టారర్ సినిమాలో నటించడం పై వెంకటేష్ వివరిస్తూ ‘ప్రజలు నన్ను డిఫరెంట్ గా చూడాలనుకుంటున్నారు. డిఫరెంట్ రోల్స్ నటించడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నాను. గతంలో ఇలాంటి అవకాశం రాలేదు. ఈ విషయం బాలీవుడ్ మనకన్నా చాలా ముందు ఉంది. ఇప్పటి నుండి మన వద్ద కూడా అలాంటి సినిమాలు వస్తాయి’ . అని అన్నాడు.

వెంకటేష్,రామ్ కలిసి నటించిన మసాలా సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమాని బాలీవుడ్ సినిమా ‘బోల్ బచ్చన్’ కి రిమేక్ గా నిర్మించారు.

తాజా వార్తలు