లఘు చిత్రాల పోటీ.. ఉత్తమ చిత్రానికి లక్ష!

లఘు చిత్రాల పోటీ.. ఉత్తమ చిత్రానికి లక్ష!

Published on Apr 20, 2020 12:11 AM IST

‘పీపుల్ మీడియా సోషల్’ అంటూ ప్రతిభ కలిగిన లఘు చిత్ర నటీ నటులు,దర్శకులు మరియు సాంకేతిక నిపుణులకు ఓ మంచి అవకాశం వచ్చింది. ఈ లాక్ డౌన్ సమయంలో నూతన దర్శకులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో పీపుల్ మీడియా సోషల్ వారు లఘు చిత్ర పోటీలను నిర్విహిస్తున్నారు.

ఈ సందర్భంగా ‘పీపుల్ మీడియా సోషల్’ పోస్ట్ చేస్తూ.. ‘ఈ కష్టకాలంలో ఇంట్లోనే ఉండి, మీ వద్ద ఉన్నదానితోనే ఓ షార్ట్ ఫిల్మ్ చేయండి, ఉత్తేజకరమైన కంటెంట్ మీ దగ్గర ఉందా.. వెంటనే షార్ట్ ఫిల్మ్ చేయండి. ఉత్తమ లఘు చిత్రానికి లక్ష రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది. అని ‘పీపుల్ మీడియా సోషల్’ ప్రకటించింది. షార్ట్ ఫిల్మ్ ను మే 15వ తేదీ లోపు సబ్ మిట్ చేయాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు