ఏప్రిల్ లో రానున్న పెళ్లి పుస్తకం

ఏప్రిల్ లో రానున్న పెళ్లి పుస్తకం

Published on Feb 1, 2013 12:20 AM IST

pelli-pustakam
రాహుల్ మరియు నీతి టేలర్ ప్రధాన పాత్రలలో “పెళ్లి పుస్తకం” అని ఒక చిత్రం రానుంది. రామకృష్ణ మచ్చకంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెళ్లి తరువాత ఒక జంట ఎదురుకునే పరిస్థితుల కథాంశంగా తెరకెక్కింది. “నా జీవితంలో నేను చూసిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చితాన్ని తెరకేక్కించాను” అని దర్శకుడు తెలిపారు. రాహుల్ గతంలో “అందాల రాక్షసి” చిత్రంలో కనిపించగా నీతి టేలర్ “మేం వయసుకి వచ్చాం” చిత్రంలో కనిపించారు. లక్ష్మి నరసింహ సినీ విజన్స్ బ్యానర్ మీద బి.నాగిరెడ్డి, బి.వి.గోపాల్, పి.సుమన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర పాటలు మార్చ్ లో విడుదల చెయ్యనున్నారు చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

తాజా వార్తలు