మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే పెద్ది. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ నుంచి వచ్చిన మొదటి సాంగ్ చికిరి చికిరి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో దంచికొడుతుంది. ఇలా పాన్ ఇండియా భాషల్లో ఈ సాంగ్ ఇప్పుడు ఏకంగా 75 మిలియన్ కి పైగా వ్యూస్ ని రాబట్టి యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతుంది.
ఇక నెక్స్ట్ స్టాప్ 100 మిలియన్ అనే చెప్పాలి. అలాగే తెలుగులోనే 50 మిలియన్ దగ్గర వ్యూస్ 1 మిలియన్ లైక్స్ కి చేరువలో ఈ సాంగ్ ఉంది. ఇలా మొత్తానికి మాత్రం పెద్ది సాంగ్ మేనియా ఇప్పట్లో ఆగేలా లేదనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
#ChikiriChikiri crosses the 75 MILLION + VIEWS milestone on YouTube with 1.44 MILLION+ Likes ❤????❤????
Song TRENDING #1 on YouTube since release ????
???? https://t.co/l1dAnuhT86#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/5grWSeBmxl
— PEDDI (@PeddiMovieOffl) November 15, 2025
