‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ అప్పుడేనా?

Peddi Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే పెద్ది. మంచి హైప్ ఉన్న ఈ సినిమా నుంచి ఇపుడు అంతా ఫస్ట్ సింగిల్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సాంగ్ పై లేటెస్ట్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా హింట్ ఇవ్వడం జరిగింది. ఈ సాంగ్ ఒక రొమాంటిక్ నెంబర్ గా రానున్నట్లు తెలిపారు.

ఇది వరకే ఇలాంటి సాంగ్ నే మేకర్స్ వదిలే ఛాన్స్ ఉన్నట్టుగా మేము కన్ఫర్మ్ చేసాము. సో ఫైనల్ గా ఇదే రానుంది అని ఇప్పుడు దర్శకుడు కూడా కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఎగ్జైట్మెంట్ డబుల్ అయ్యింది. కానీ ఈ సాంగ్ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే దీపావళి పండుగ కనిపిస్తుంది కానీ ఇప్పుడే వస్తుందా లేక తర్వాత వస్తుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version