టాలీవుడ్ లో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు అని అడిగితే టక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పింది బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. క్వారంటైన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్న పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో చాట్ చేసింది. ఇక ఫ్యాన్స్ లో ఒకరు టాలీవుడ్ లో ఏ హీరోలతో కలిసి నటించాలని కోరుకుంటున్నారు అని అడుగగా ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. మరి టాలీవుడ్ లో ఇంత మంది యంగ్ హీరోలను కాదని విజయ్ దేవరకొండ పేరు చెప్పడం విశేషమే
కాగా పాయల్ రాజ్ పుత్ కెరీర్ ఏమంత సక్సెస్ ఫుల్ గా సాగడం లేదు. తెలుగులో ఆమె మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100 కాగా అది సూపర్ సక్సెస్ కొట్టింది. ఐతే ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ పాయల్ కి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. గత ఏడాది విడుదలైన వెంకీ మామ ఒక హిట్ మూవీగా తన ఖాతాలో ఉంది. పాయల్ తన నెక్స్ట్ మూవీలో పోలీస్ రోల్ చేయనుంది.