‘వకీల్ సాబ్’ ఎంట్రీనే ఫైట్ అట !

‘వకీల్ సాబ్’ ఎంట్రీనే ఫైట్ అట !

Published on Apr 21, 2020 6:55 AM IST

‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఓపెనింగే ఫైట్ మీదే ఓపెన్ అవుతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్‌ కావడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే విషయమే. అలాగే ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారట.

ఇక కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీని స్తంభింప చేసేసింది. దాంతో సినిమాలన్ని పోస్ట్ ఫోన్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ను మొదట మే 15న ఆ తరువాత మళ్లీ జూన్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగష్టు నెలకు పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఈ వార్తకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా పవన్ రీఎంట్రీ సినిమాని ఎప్పుడెప్పుడూ చేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం సినిమా వాయిదా అనేది బాగా నిరాశ పరిచేదే. ఇక దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు