రిషి కపూర్ మరణంపై విచారం వ్యక్తం చేసిన పవన్

హీరో పవన్ కళ్యాణ్ సీనియర్ నటుడు రిషి కపూర్ అకాల మరణానికి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటని ఆవేదన పడ్డారు. రిషి కపూర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. రిషి కపూర్ అకాల మరణానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణానికి అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్ ని గత రాత్రి ఆసుపత్రిలో చేర్చగా ఈ ఉదయం ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ముంబై లో నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.

Exit mobile version