పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్నచిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు”. నిన్నటి వరకు సారధి స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఈ రోజు నుంచి పద్మాలయా స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ప్రస్తుత రాజకీయ అంశాలపై సెటైర్లు వేసే మీడియా నేతృత్వంలో తెరకెక్కుతోంది.
అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్ర చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యాం కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.