శరవేగంగా పవన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్

శరవేగంగా పవన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్

Published on Jul 8, 2013 6:54 PM IST

Pawan-Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న’అత్తారింటికి దారేది’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఈ రోజు ఈ సినిమా డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఈ సినిమాని ఆగష్టు మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సరసన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. వీరి ఇద్దరి కాంబినేషన్ వస్తున్న మొదటి సినిమా కావడం వల్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వన్ని, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో, ఫస్ట్ లుక్ ని త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు