మొదలైన ‘పవనిజం’ మూవీ

మొదలైన ‘పవనిజం’ మూవీ

Published on Aug 11, 2013 2:46 PM IST

PAWANISM (1)పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ మొదటి నుంచి తన నటనతో, సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకన్నా10 రెట్లు ఎక్కువగానే అభిమానులను సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ బయట తక్కువగానే కనపడినా, తక్కువగా మాట్లాడినా కానీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లోనే పవన్ అభిమానులు ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానానికి చిహ్నంగా పవన్ అభిమానులందరూ కలిసి ‘పవనిజం’ అనే టైటిల్ ని పెట్టుకున్నారు.

ఇప్పుడు అదే పేరుని సినిమాకి టైటిల్ గా పెట్టుకొని కొంతమంది అభిమానులు ‘పవనిజం’ అనే సినిమాని ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము.

తాజా వార్తలు